News October 8, 2025
వంగర: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

వంగర మండలం మగ్గూరుకి చెందిన కళ్లే పిల్లి జగదీష్ (33) మంగళవారం రుషింగి వంతెన పైనుంచి దూకిన విషయం తెలిసిందే. కిమ్మి, రుషింగి గ్రామాలకు చెందిన వారు గాలించినప్పటికీ జగదీష్ జాడ కనిపించలేదు. భార్య ఫిర్యాదుతో వంగర పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం NDRF, పోలీసు బృందాల గాలింపు చేపట్టగా వీరఘట్టం మండలం మెట్ట వెంకటపురం వద్ద మృతదేహం లభ్యమైంది.
Similar News
News October 8, 2025
సిరిమాను చెక్క కోసం బారులు తీరిన భక్తులు

ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం సిరిమాను చెక్కలను తీసుకొని వెళ్లడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిమాను చెక్కలను తీసుకెళ్లిన భక్తులు వారి ఇంటిలో ఉంచుకుంటారు. దీంతో సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News October 8, 2025
రాజాం: 24 గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి

రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన రాష్ట్రస్థాయి డోలక్ వాయిద్యం ప్రసిద్ధుడు కొన్న బాలకృష్ణ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. తన తండ్రి మరణం తట్టుకోలేక 2వ కుమారుడు అప్పలరాజు (32) మంగళవారం మరణించాడు. 24 గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News October 8, 2025
విశాఖలో వరల్డ్ కప్.. టికెట్ ధర రూ.100 మాత్రమే

విశాఖ వేదికగా జరిగే ఉమెన్స్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లను రూ.100 చెల్లించి చూసేందుకు ACA అవకాశం కల్పించింది. ఈనెల 12న జరిగే ఇండియా Vs ఆస్ట్రేలియా మ్యాచ్ (రూ.150) మినహా మిగిలిన 4మ్యాచ్‌లకు టికెట్ ధర రూ.100 మాత్రమే.
➤ అక్టోబర్ 9: ఇండియా Vs సౌతాఫ్రికా
➤ అక్టోబర్ 12: ఇండియా Vs ఆస్ట్రేలియా
➤ అక్టోబర్ 13: బంగ్లాదేశ్ Vs సౌతాఫ్రికా
➤ అక్టోబర్ 16: ఆస్ట్రేలియా Vs బంగ్లాదేశ్
➤ అక్టోబర్ 26: ఇంగ్లాండ్ Vs న్యూజిలాండ్