News April 5, 2025
వంగవీటి రాధకు త్వరలో కీలక పదవి.?

వంగవీటి రాధకు త్వరలో కీలక పదవి దక్కనుందని తాజాగా విజయవాడలో వార్తలు జోరందుకున్నాయి. కూటమి ప్రభుత్వం తొలుత రాధను శాసనమండలికి పంపిస్తుందని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇటీవల వరుసగా 2 రోజుల పాటు సీఎం చంద్రబాబుతో రాధ భేటీ అయ్యారు. దీంతో రాధకు కీలకమైన నామినేటెడ్ పదవి దక్కనుందని వార్తలొస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Similar News
News February 28, 2026
నల్గొండ: 9,750 కుటుంబాలకు రంజాన్ తోఫా..!

రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు అందజేసేందుకు ప్రభుత్వం కానుకలు సిద్ధం చేసింది. పండుగ సమీపిస్తుండడంతో రంజాన్ తోఫా జిల్లాలకు చేరవేసింది. దీంట్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి తోఫా అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 9,750 కుటుంబాలను గుర్తించారు. ఆయా కుటుంబాలకు రంజాన్ తోఫాతో పాటుగా ప్రభుత్వం నూతన దుస్తులు అందించనుంది.
News February 28, 2026
జగిత్యాల బస్టాండ్‌లో తండ్రిని వదిలేసిన కొడుకు

ధర్మపురి పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తామని నమ్మించి కన్నతండ్రిని నడిరోడ్డుపై వదిలేశాడో కొడుకు. NZBకు చెందిన నారాయణను అతడి కొడుకు రమేశ్ జగిత్యాల బస్టాండ్‌లో విడిచిపెట్టి వెళ్లాడు. విషయం తెలుసుకున్న సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆయనకు అండగా నిలిచారు. బాధ్యులైన కొడుకు, కోడలికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారు పశ్చాత్తాపపడి, క్షమాపణలు కోరుతూ తండ్రిని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
News February 28, 2026
బైరెడ్డి ఎప్పటికీ నా శత్రువే: గౌరు వెంకటరెడ్డి

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనకు ఎప్పటికీ శత్రువేనని టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అతడు ఎన్నడూ మాట మీద నిలబడలేదని విమర్శించారు. తనపై గతంలో రాజకీయ కక్షతోనే కేసులు పెట్టించారని ఆరోపించారు. కేవలం సీఎం చంద్రబాబుపై గౌరవంతోనే గత ఎన్నికల్లో కలిసి పనిచేశామని స్పష్టం చేశారు. ఎంపీ శబరి ఎమ్మెల్యేల సహకారంతో నియోజకవర్గ పర్యటనలు చేస్తే బాగుంటుందని సూచించారు.


