News August 9, 2025

వంజంగిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

image

పాడేరు మండలం వంజంగిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. తొలుత వనదేవతల ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం కాఫీ తోటలను సందర్శించారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయన వెంట మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ ఇతర అధికారులున్నారు.

Similar News

News August 9, 2025

సౌర ఫలకాల ఏర్పాటు: నిర్మల్ అదనపు కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర ఫలకాలను ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వివరాలను వారంలోగా అందివ్వాలన్నారు.

News August 9, 2025

సర్కారీ భవనాలపై సోలార్ ప్యానెల్స్.. 7రోజుల్లో వివరాలు పంపాలి’

image

రాష్ట్రవ్యాప్తంగా GOVT. కార్యాలయాలపై యుద్ధప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక- ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన, గ్రామపంచాయతీ నుంచి సెక్రటేరియట్ వరకు అన్ని కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల వివరాలు 7 రోజుల్లో పంపాలని కోరారు. ROFR భూములపై సోలార్ పంపు సెట్లు 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నారు.

News August 9, 2025

రాఖీ రోజున ఆడపడుచులకు పవన్ కానుక

image

AP: రక్షాబంధన్ రోజున ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊహించని కానుక ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వారిలో ఆత్మస్థైర్యం నింపి, భరోసా కల్పించాలనే పవన్ ఆదేశాలతో కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. పవన్ స్ఫూర్తితో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు రక్షాబంధన్ కానుకలు అందజేశారు.