News November 16, 2025
వంటింటి చిట్కాలు

* సమోసా పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించే సమయంలో అందులో చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది. అలాగే వేయించడం కూడా త్వరగా పూర్తవుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైతే స్పూన్ శనగపిండి కలపండి.
* ఓవెన్‌లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో బ్రెడ్‌తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్ మెత్తగా మంచి రంగులో ఉంటుంది.
Similar News
News November 16, 2025
ఎల్లుండి ఉ.10 గంటలకు..

AP: ఫిబ్రవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈనెల 18న 10AMకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న 10AM వరకు నమోదుచేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం లోపు డబ్బు చెల్లించాలి. 21న కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ తదితర టికెట్లు, 24న శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, 25న రూ.300 టికెట్ల కోటాను రిలీజ్ చేస్తారు.
News November 16, 2025
ఫేస్ క్రీమ్ వాడుతున్నారా?

కొన్ని క్రీములను కలిపి రాయడం వల్ల అదనపు ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..ముడతలు ఎక్కువగా ఉన్నవారు విటమిన్-సి ఉన్న క్రీములతో పాటు సన్‌స్క్రీన్ లోషన్ కలిపి రాయాలి. చర్మం మృదువుగా ఉండాలంటే రెటినాల్, పెప్టైడ్ క్రీములు ఎంచుకోండి. అయితే రెటినాల్‌ను రాత్రే రాయాలి. హైలురోనిక్ యాసిడ్‌తోపాటు ఏహెచ్ఎ, బీహెచ్ఎ ఉన్నవి ఎంచుకోండి. ఈ సమస్యలన్నీ తగ్గిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.
News November 16, 2025
నా వర్క్‌కు పర్సనల్ నంబర్ వాడను: అదితీరావు

హీరోయిన్ అదితీరావు హైదరీ ఫొటోలను ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘ఫొటోషూట్‌ల పేరుతో ఫొటోగ్రాఫర్లకు దుండగులు వాట్సాప్‌లో నా ఫొటో పెట్టుకొని సంప్రదిస్తున్నారు. నేనెప్పుడూ నా వర్క్‌కు పర్సనల్ నంబర్‌ను వాడను. ఏదైనా నా టీమ్ చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.


