News November 6, 2025

వంటింటి చిట్కాలు

image

* పూరీలు తెల్లగా రావాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికలు చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయిస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ వస్తాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించేముందు కాసేపు ఎండలో పెడితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.

Similar News

News March 27, 2026

రూ.9,335 కోట్లతో తాగు నీటి సరఫరా

image

AP: రాష్ట్రంలో ఏడు మల్టీ విలేజ్ తాగునీటి పథకాలకు ప్రభుత్వం రూ.9,335 కోట్లను మంజూరు చేసింది. కాకినాడ, అనకాపల్లి(D)లకు ఏలేరు రిజర్వాయర్ నుంచి, చిత్తూరు(D)కు గండికోట నుంచి, శ్రీకాకుళం(D) టెక్కలి, నరసన్నపేటకు హిరమండలం నుంచి నీటిని అందించనుంది. అనంతపురం(D) ఉరవకొండ, రాయదుర్గంకు PABR నుంచి, కర్నూలు(D) బనగానపల్లికి ఓక్ రిజర్వాయర్ నుంచి, తూ.గో(D) కడియంకు ధవళేశ్వరం నుంచి నీటిని అందించే పనులు చేయనుంది.

News March 27, 2026

కరెంట్ అఫైర్స్

image

* హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాల్లోకి మారితే SC హోదా వర్తించదని SC తీర్పు.* దేశీయ తయారీ, స్టార్టప్ రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం బ్లూ స్టార్ లిమిటెడ్‌తో ఒప్పందం.* ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాక్. ఆరో స్థానంలో భారత్. * 2019 నుంచి PM-KISAN కింద రైతులకు రూ. 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు అందాయి. * ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రం గుజరాత్.

News March 27, 2026

హోటళ్లు, రెస్టారెంట్లలో ‘LPG’ బిల్లు వేస్తున్నారా?

image

హోటళ్లు, రెస్టారెంట్ల ఫుడ్ బిల్లులో ఎల్పీజీ ఛార్జ్, గ్యాస్ సర్‌ఛార్జ్, ఫ్యూయెల్ కాస్ట్ పేరుతో అదనపు డబ్బులు వసూలు చేయకూడదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. బిల్లులో మెనూ, ట్యాక్సెస్ మాత్రమే ఉండాలని తెలిపింది. ఒకవేళ ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తే 1915 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో అయితే 7416687878కు వాట్సాప్ చేయాలని లేదా E-JAGRITI పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.