News December 11, 2025
వంటింటి చిట్కాలు

* బెండకాయ కూర వండేటప్పుడు రెండు చుక్కల వెనిగర్ కలిపితే ముక్కలు అంటుకోకుండా ఉంటాయి.
* ఫ్లాస్క్‌లో దుర్వాసన పోవాలంటే, ఓ చెంచాడు పంచదార వేసి బాగా కుదిపి గోరువెచ్చని నీటితో కడగాలి.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఉప్మా రవ్వను ప్లాస్టిక్ కవర్లో పోసి ఫ్రిజ్ లో ఉంచితే పురుగు పట్టకుండా చాలా కాలం తాజాగా ఉంటుంది.
Similar News
News December 15, 2025
జోర్డాన్‌కు చేరుకున్న మోదీ.. ఢిల్లీలో ముగిసిన మెస్సీ టూర్

⋆ రెండు రోజుల పర్యటన కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ల్యాండ్ అయిన PM మోదీ.. స్వాగతం పలికిన జోర్డాన్ పీఎం జాఫర్ హసన్.. ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పర్యటన
⋆ ఢిల్లీలో ముగిసిన ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటన.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్‌ను పలకరించిన మెస్సీ.. టీమ్ ఇండియా జెర్సీలు, INDvsUSA T20 WC టికెట్లు, బ్యాట్‌ను ప్రజెంట్ చేసిన ఐసీసీ ఛైర్మన్ జైషా
News December 15, 2025
ప్రియాంకా గాంధీతో PK భేటీ.. ఏం జరగబోతోంది?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీని కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2022లో కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం మూడేళ్లకు ఈ భేటీ జరిగింది. బిహార్‌లో PKకి చెందిన జన్ సురాజ్ పార్టీతో పాటు కాంగ్రెస్‌కి కూడా దారుణ ఫలితాలు వచ్చాయి. గతంలో కాంగ్రెస్‌ను విమర్శించిన PK ఇప్పుడు పునరాలోచనలో పడ్డారా?లేదా కాంగ్రెస్ కొత్త వ్యూహానికి రెడీ అవుతోందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
News December 15, 2025
విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

విమాన ప్రయాణ ఛార్జీలను ఇష్టానుసారం వసూలు చేయకుండా కట్టడి చేస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘టారిఫ్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తాం. విమాన టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రయాణికులు గమనిస్తే వాటి స్క్రీన్ షాట్లను మాకు పంపించొచ్చు’ అని వివరించారు. డొమెస్టిక్ మార్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ రూట్ల ఛార్జీలనూ మానిటర్ చేస్తామని పార్లమెంటులో ప్రకటించారు.


