News January 1, 2026

వంటింటి చిట్కాలు

image

* బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే, చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని వాటికి రుద్దాలి.
* గోధుమ పిండి, శెనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాలో బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి.
* కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.
* తీపి పదార్థాలు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు వేయడం మరవకండి. పదార్థాలు మంచి రుచిగా ఉంటాయి.

Similar News

News January 1, 2026

కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

image

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.

News January 1, 2026

రూ.3వేల కోట్ల విడుదలపై కేంద్రం షరతులు

image

TG: ఎన్నికలు జాప్యం కావడంతో పంచాయతీలకు రావలసిన ₹3000 CR ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్రం 2023 నుంచి నిలిపి వేసింది. ఇటీవల ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం వివరాలు సమర్పించి నిధులు విడుదల చేయాలని కోరింది. అయితే గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నిధుల వినియోగంపై ధ్రువపత్రాలు సమర్పించాలని కేంద్రం తాజాగా కొర్రీ వేసింది. దీంతో నిధుల సత్వర విడుదలకు కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి సీతక్క నిర్ణయించారు.

News January 1, 2026

H-1B వీసా జాప్యం.. అమెజాన్ ఉద్యోగులకు ఊరట

image

అమెరికాలో H-1B వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల భారత్‌లో చిక్కుకుపోయిన తమ ఉద్యోగులకు అమెజాన్ ఊరటనిచ్చింది. వీరు 2026 మార్చి 2 వరకు ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. అయితే వీరు కోడింగ్, క్లయింట్లతో మాట్లాడటం, కీలక నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు చేయొద్దని కఠిన ఆంక్షలు విధించింది. అమెరికా కొత్తగా తెచ్చిన సోషల్ మీడియా స్క్రీనింగ్ నిబంధనల వల్ల వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది.