News January 14, 2026

వంటింటి చిట్కాలు

image

* గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని వెల్లుల్లి రేకలను మెత్తగా చేసి ఓ గంట పెరుగులో నానబెట్టి దాన్ని బ్రెడ్ స్లైసుల మీద పరిచి టోస్ట్ చేస్తే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలుచగా అయితే కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* మాంసాన్ని సన్నని స్లైసుల్లా తరగాలనుకుంటే, కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చాకుతో కోస్తే ఈజీగా వస్తాయి.
* సాంబారు రుచిగా ఉండాలంటే మసాలా పొడిలో కొద్దిగా నిమ్మరసం చేర్చాలి.

Similar News

News January 22, 2026

నేడు కోటప్పకొండకు పవన్ కళ్యాణ్

image

AP: నేడు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉ.10.30 గంటలకు హెలికాప్టర్‌లో కోటప్పకొండకు చేరుకోనున్నారు. ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మార్గం మధ్యలో ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శిస్తారు. తర్వాత కోటప్పకొండ-కొత్తపాలెం మధ్య రూ.3.9 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలపై పవన్ సమీక్ష చేయనున్నారు.

News January 22, 2026

వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!

image

బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27(మంగళవారం)న సమ్మె జరగనుంది. వారానికి ఐదు పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ రోజుల్లో డిజిటల్, ఏటీఎం సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. ఏమైనా బ్యాంక్ పనులుంటే ఇవాళ, రేపు ప్లాన్ చేసుకోవడం మేలు.

News January 22, 2026

సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

image

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్‌-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్‌ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.