News January 23, 2026
వంటింటి చిట్కాలు

* పూరీలు తెల్లగా ఉండాలంటే వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికల పిండిలో పాలు పోస్తే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
Similar News
News January 23, 2026
అవసరమైతే కేటీఆర్‌ను మళ్లీ పిలుస్తాం: సజ్జనార్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. విచారణ పూర్తిగా చట్టబద్ధంగా జరుగుతోందన్నారు. కేటీఆర్‌ను ఒంటరిగానే విచారించామని, ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినట్లు చెప్పారు. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని కేటీఆర్‌కు చెప్పామన్నారు. కాగా ఇవాళ కేటీఆర్‌ను సిట్ 7 గంటలకు పైగా ప్రశ్నించింది.
News January 23, 2026
మోదీకి మద్దతు ఎందుకు: YS షర్మిల

AP: రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయడంలోనూ, అమరావతికి రాజధాని హోదా కల్పించడంలోనూ మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. VB-G RAM G బిల్లులోని 60:40 విధానం వలన ఏపీపై భారం పడుతుందంటూనే మరోవైపు సాయం కోరడంపై ఆగ్రహించారు. తొలుత బిల్లుకు ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. మోదీకి చంద్రబాబు మద్దతు కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
News January 23, 2026
మేడారం జాతరకు కేంద్రం నిధులు విడుదల

TG: మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న వేడుకల్లో వసతుల కోసం అధికారులు వీటిని ఖర్చు చేయనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘గిరిజన సర్క్యూట్ పేరిట’ రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.


