News February 2, 2026

వంటింటి చిట్కాలు

image

* స్వీట్లు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు వేస్తే మంచి రుచిగా ఉంటాయి. * పప్పులకు పురుగు పట్టకుండా ఎక్కువరోజులు తాజాగా ఉండాలంటే, వాటిని నిల్వ చేసే డబ్బాలో అడుగున నాలుగైదు వెల్లుల్లి రేకలు వేయాలి. * కొబ్బరి ముక్కలు నిల్వ ఉన్నా వాసన రాకుండా ఉండాలంటే, చిప్పల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేయాలి. * బాదం, వేరుశనగ, జీడిపప్పు వంటివాటిని డబ్బాల్లో పెట్టే బదులు, ప్లాస్టిక్ సంచుల్లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.

Similar News

News February 2, 2026

117 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>NCERT<<>> 117 అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్:www.ncert.nic.in

News February 2, 2026

మోమోల కోసం రూ.85లక్షల విలువైన గోల్డ్ ఇచ్చేశాడు

image

మోమోలపై ఉన్న ఇష్టంతో ఉత్తరప్రదేశ్‌లో 7వ తరగతి బాలుడు రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను మోసగాళ్లకు ఇచ్చేశాడు. మోమో స్టాల్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు తన కుమారుడిని మోసం చేశారని బాలుడి తండ్రి విమలేశ్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి నగలు తెస్తే, ఉచితంగా మోమో ఇస్తామని స్టాల్ యజమానులు చెప్పడంతో ఆ బాలుడు ఆభరణాలిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

News February 2, 2026

‘పవార్ ప్లే’ మళ్లీ మొదలవుతుందా?

image

మహారాష్ట్ర Dy.CM, NCP చీఫ్ అజిత్ పవార్ అకాల మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో గ్యాప్ ఏర్పడింది. దీనిని భర్తీ చేసేందుకు బాబాయ్ శరద్ పవార్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చీలిపోయిన NCPని మళ్లీ కలిపేందుకు కృషి చేస్తూనే బారామతి, పుణే వంటి పవార్ల కంచుకోటలపై పట్టుసడలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న పవార్ ఇప్పుడు యాక్టివ్ అవడం ‘మహా’ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.