News January 31, 2025

వంట చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

image

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నేలతలమర్రి గ్రామానికి చెందిన కుసూరు తిక్కన్న (60) గురువారం గుండ్లకొండలో జరుగుతున్న వేడుకలో వంట పనికి వెళ్లారు. వంట చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్ద మరణించడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News September 19, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు ఈనెల 24 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 19, 2025

అంతర్గత, బాహ్య పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు

image

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్‌లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.

News September 19, 2025

ఈ నెల 22 నుంచి దసరా సెలవులు: లోకేశ్

image

AP: దసరా సెలవులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉన్నాయి. తాజాగా మార్చడంతో అదనంగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.