News January 24, 2025
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ADB వాసికి చోటు

పట్టుదలతో ముందుకు సాగుతూ విజయాలు సాధించాలని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కో ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఎస్.విఠల్ 28 నిమిషాల్లో 125 సార్లు సూర్య నమస్కారం చేసి రికార్డు సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను సత్కరించారు.
Similar News
News November 8, 2025
కొనికి శివారులో వాగు వద్ద మృతకళేబరం కలకలం

ఇంకొల్లు మండలం కొనికి గ్రామంలోని శివారు ప్రాంతంలో ఉన్న వాగు వద్ద పొలాల్లో శనివారం గుర్తుతెలియని మృతకళేబరం కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని ఈ కళేబరాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులో కొట్టుకు వచ్చిందా? పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.
News November 8, 2025
బోయినపల్లి: డ్యామ్‌పై పిచ్చి మొక్కల బెడద

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మన్వాడ వద్ద గల మిడ్ మానేరు డ్యామ్ రోడ్డుపై పిచ్చి మొక్కల బెడద ఎక్కువైంది. కొదురుపాక నుంచి డ్యామ్ మీదుగా వెళ్లే రహదారికి ఇరువైపులా పిచ్చి చెట్లు అడ్డంగా పెరగడంతో పర్యాటకులకు, స్థానికులకు ఇబ్బందిగా మారింది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
News November 8, 2025
KGHలో పవర్ కట్.. ప్రభుత్వం సీరియస్

KGHలో గురువారం 10 గంటలపాటు కరెంట్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఛైర్మన్‌గా ఉన్న ఈ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ అంతరాయం జరగడంపై ఆరోగ్యశాఖ సీరియస్ అయింది. కాగా.. కనీసం జనరేటర్లు కూడా సమకూర్చలేరా అంటూ YCP ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా ఎత్తిచూపింది. ‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది’అంటూ YCP నేతలు విమర్శలు గుప్పించారు.


