News January 24, 2025

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ADB వాసికి చోటు

image

పట్టుదలతో ముందుకు సాగుతూ విజయాలు సాధించాలని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కో ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఎస్.విఠల్ 28 నిమిషాల్లో 125 సార్లు సూర్య నమస్కారం చేసి రికార్డు సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను సత్కరించారు.

Similar News

News January 24, 2025

TG ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోంది: కిషన్ రెడ్డి

image

తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ‘ఒప్పందాలు పేపర్‌కే పరిమితం కావొద్దు. రాష్ట్రానికి చెందిన వారిని దావోస్‌కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి? పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News January 24, 2025

న్యూయార్క్‌లో 5 రోజులుగా గన్ కాల్పుల్లేవ్..!

image

న్యూయార్క్‌లో గత ఐదు రోజులుగా ఒక్క చోట కూడా కాల్పులు చోటుచేసుకోలేదని సిటీ పోలీసులు తెలిపారు. ఇలా 5 రోజులపాటు కాల్పులు జరగకపోవడం 30 ఏళ్లలో ఇదే తొలిసారని వెల్లడించారు. అలాగే 2024 డిసెంబర్‌లో తుపాకీ కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తెలిపారు. అదే 2023 డిసెంబర్‌లో 9 మంది తూటాలకు బలైనట్లు పేర్కొన్నారు. కాగా కొన్ని దశాబ్దాలుగా న్యూయార్క్‌లో నిత్యం ఏదోకచోట కాల్పులు జరగడం పరిపాటిగా మారింది.

News January 24, 2025

‘అఖండ-2’లో హీరోయిన్‌గా సంయుక్తా మేనన్

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’ సినిమాలో సంయుక్తా మేనన్‌ను చేర్చుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ శరవేగంగా సాగుతోందని, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. అయితే, అఖండ చిత్రంలో నటించిన ప్రగ్యా జైస్వాల్‌ను తప్పించి సంయుక్తా మేనన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే బోయపాటి ‘మహాకుంభమేళా’లో షూటింగ్ కూడా పూర్తి చేశారు.