News November 7, 2025

వందేమాతరం దేశస్ఫూర్తికి ప్రతీక: SP

image

వందేమాతరం గేయం 150 ఏళ్ల వేడుకలను తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సిబ్బందితో కలిసి వందేమాతరం ఆలపించారు. దేశభక్తితో నిండిన ఈ వేడుకలో ఎస్పీ మాట్లాడుతూ.. వందేమాతరం మన దేశస్ఫూర్తికి ప్రతీక అన్నారు. ప్రతి భారతీయుడు ఈ గేయాన్ని తమ హృదయంలో నిలుపుకోవాలని ఆయన కోరారు.

Similar News

News November 7, 2025

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

తిరుపతిలోని <>శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ<<>>లో 24 అకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. M.Phil/PhD అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. వెబ్‌సైట్: https://svuniversityrec.samarth.edu.in

News November 7, 2025

భీమవరం: క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ

image

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మీ పాల్గొన్నారు.

News November 7, 2025

ఇల్లందు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి

image

రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లాలోని రోడ్లను అభివృద్ధి చేయాలని నాయకుడు రాజేందర్ డిమాండ్ చేశారు. వాహనాలపై పన్నులు పెంచి వసూలు చేస్తున్న ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రోడ్లపై తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు.