News August 22, 2025
వందే భారత్ రైళ్లు ఇవే.. అసంతృప్తిగా ‘HYD- నాగపూర్’

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 20707, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం 20834, కాచిగూడ నుంచి బెంగళూరు 20703, సికింద్రాబాద్ నుంచి తిరుపతి 20701, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ 20102 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. జులై నాటికి విశాఖపట్నం వెళ్లే రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో గరిష్ఠంగా ఉండగా, నాగపూర్ వెళ్లే రైలు ఆక్యుపెన్సీ రేషియో అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Similar News
News August 22, 2025
పెన్షన్‌దారులకు మరో అవకాశం: కలెక్టర్

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెరిఫికేషన్‌లో తొలగించిన దివ్యాంగుల పింఛన్ దారులకు మరో అవకాశం కల్పిస్తామన్నారు. దీనిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News August 22, 2025
SSS: నూతన బార్ పాలసీకి నోటిఫికేషన్ విడుదల

శ్రీ సత్యసాయి జిల్లాలో 12 బార్ల ఏర్పాటుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ధర్మవరం 03, హిందూపూర్ 04, కదిరి 03, పెనుకొండ 01, మడకశిరలో 01 కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి గోవింద నాయక్ శుక్రవారం తెలిపారు. అమ్మకాల సమయాన్ని పెంచుతూ నిర్ణయించామన్నారు. ఈనెల 26 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News August 22, 2025
లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు

TG: హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్‌టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.