News August 21, 2025
‘వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్లు నిర్మాణం’

వచ్చే ఏడాది మార్చి కల్లా రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు తెలిపారు. బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గృహ నిర్మాణ శాఖ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. నెల రోజుల్లో 3 లక్షల కుటుంబాలకు గృహప్రవేశాలు చేపట్టాలని, ఇళ్లులేని పేదలను గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే నిర్వహించాలని ఆదేశించారన్నారు.
Similar News
News April 12, 2026
MLG: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
News April 12, 2026
సింహాచలం: రేపటి నుంచి చందనోత్సవం టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి

ఏప్రిల్ 20న జరగనున్న సింహాచలం చందనోత్సవం టికెట్లను ఏప్రిల్ 13 నుంచి 17వరకు విక్రయించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.300,రూ.1000, దర్శన టికెట్లు అక్కయ్యపాలెం, సింహాచలం యూనియన్ బ్యాంక్, సింహాచలం, బిర్లా జంక్షన్ శాఖ ఎఅమ్మనున్నారు. https://chandanotsavam.ap.gov.in ద్వారా రూ. 300,రూ.1000 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తెలిపారు.
News April 12, 2026
ప్రచారంలో బ్రేక్.. IPL చూసిన సీఎం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం స్టాలిన్ కాసేపు రిలాక్స్ అయ్యారు. కారులో వెళ్తూ ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన IPL మ్యాచ్ వీక్షించారు. ‘హై ఓల్టేజ్ ప్రచారంలో IPL బ్రేక్. సంజూ శాంసన్ సెంచరీ చేసినప్పటికీ.. నా అభిమాన క్రికెటర్ ధోనీని మిస్ అవుతున్న భావన పోవడం లేదు’ అని ట్వీట్ చేశారు. మ్యాచ్ చూస్తున్న ఫొటో షేర్ చేశారు. తమిళనాడులో ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి.


