News October 14, 2025
వచ్చే నెల నుంచి ముఖ ఆధారిత హాజరు: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో వచ్చే నెల నుంచి ముఖ ఆధారిత హాజరు అమల్లోకి వస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకు అవసరమైన ఈకేవైసీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా పనులు కల్పించాలన్నారు. ప్రతి మండలంలో ఒక మ్యాజిక్ డ్రైన్ పూర్తి చేయాలన్నారు.
Similar News
News October 14, 2025
వెంకటేశ్ మూవీ హిందీ రీమేక్‌లో అక్షయ్

వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అందులో తాను హీరోగా నటిస్తున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా.. హీందీలోనూ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
News October 14, 2025
సిర్పూర్ టీ: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

మద్యానికి బానిసై పురుగు మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్ వివరాలు.. మండలంలోని మాకిడి గ్రామానికి చెందిన తంగే బాలాజీ మద్యానికి బానిసై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 14, 2025
MDK: అమరవీరులను స్మరించుకుంటూ వ్యాసరచన పోటీలు: ఎస్పీ

మెదక్ జిల్లాలోని పోలీస్ ఫ్లాగ్ డే (అక్టోబర్ 21) సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకునే ఉద్దేశంతో ఈ ఆన్‌లైన్ పోటీలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని ఎస్పీ సూచించారు.