News February 3, 2025
వచ్చే నెల మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోజు 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన కేసులు పరిష్కరిస్తామన్నారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News February 9, 2026
రామగుండం: మున్సిపల్ ప్రచారంలో జనసంద్రం

రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా MLA M.S రాజ్ ఠాకూర్ ఓల్డ్ అశోక్ సెంటర్ వద్ద నిర్వహించిన సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఐఎన్‌టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై కాంగ్రెస్ పార్టీ ప్రజాహిత కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
News February 9, 2026
టీ20ల్లో చెత్త రికార్డ్

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ శనక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. ఇవాళ T20 WCలో ఐర్లాండ్‌పై డకౌటైన ఆయన టీ20ల్లో అత్యధిక(16) సార్లు సున్నాకే ఔటైన ప్లేయర్‌గా నిలిచారు. నేడు ఎదుర్కొన్న తొలి బంతినే షార్ట్ థర్డ్ మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. టీ20Iల్లో ఇతని తర్వాత రువాండ జట్టుకు చెందిన జప్పీ(15), ఐర్లాండ్ కెప్టెన్ స్టెర్లింగ్(14) డకౌట్ అయిన లిస్టులో ఉన్నారు.
News February 8, 2026
వరంగల్ సీపీ కీలక ఆదేశాలు

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, ఘన్ పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో సోమవారం సా.5 గంటలతో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సీపీ సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రచార గడువు ముగిసిన వెంటనే ప్రచారానికి వచ్చిన బయటి వ్యక్తులు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.


