News March 31, 2024
వజ్రకరూర్ మండలంలో రేషన్ డీలర్ సస్పెన్షన్

అనంతపురం జిల్లా ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘించిన వారిపై కలెక్టర్ గౌతమి చర్యలు తీసుకున్నారు. వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామానికి చెందిన చౌక దుకాణపు డీలర్ ఎస్.నాగరాజును శనివారం సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకూ 40 మంది వాలంటీర్లు, ఏడుగురు డీలర్లు, ఒక ఎండీయూ ఆపరేటర్, 11 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఒక పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌కు గురైనట్లు తెలిపారు.
Similar News
News September 8, 2025
అనంత: జిల్లాలో జ్వర పీడిత కేసులు

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 600 నుంచి 800 మధ్య జ్వర పీడితులు ఉన్నట్లు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతపురం GGHలో 1,267 బెడ్స్ ఉన్నాయని చెప్పారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా బెడ్స్ కేటాయిస్తున్నామని అన్నారు. నార్పల, పెద్దవడుగూరు, యాడికి, బెలుగుప్ప, కళ్యాణదుర్గం ప్రాంతాల నుంచి జ్వర కేసులు వస్తున్నాయని తెలిపారు.
News September 8, 2025
నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వినోద్‌కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.
News September 7, 2025
యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

జిల్లాలో యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం రాప్తాడు మండలం అయ్యవారిపల్లి రోడ్‌లో ఉన్న మార్క్‌ఫెడ్ స్టాక్ స్టోర్ గోడౌన్‌ను తనిఖీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉన్న యూరియాపై అధికారులతో ఆరా తీశారు. యూరియా పంపిణీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.