News April 2, 2025
వజ్రపుకొత్తూరు: ఒడ్డుకు కొట్టుకొచ్చిన మత్స్యకారుల మృతదేహాలు

సముద్రంలో గల్లంతైన వజ్రపుకొత్తూరు(M) మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన మత్స్యకారుల మృతదేహాలు బుధవారం ఉదయం అక్కుపల్లి, డోకులపాడు బీచ్‌ల వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఏప్రిల్ 1వ తేదీన నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా.. బుంగ ధనరాజు, వంక కృష్ణా గల్లంతై మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News April 3, 2025
ఆమదాలవలస: ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన యువతి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని బోదేపల్లి రాజగోపాల్ నగర్‌కి చెందిన జ్యోత్స్నకి రెండు రోజులు కిందట వెలువడిన ఫలితాలో మూడు బ్యాంకు ఉద్యోగాలు, ఎల్ అండ్ టి కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌గా ఎంపికైంది. ఈమె తల్లితండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. జ్యోత్స్నకి పలువురు అభినందించారు.
News April 3, 2025
శ్రీకాకుళం: పోలీసులకు చిక్కిన ప్రేమోన్మాది నవీన్

విశాఖపట్నంలోని మధురవాడలో బుధవారం నవీన్ అనే ప్రేమోన్మాది దీపిక, ఆమె తల్లి లక్ష్మిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. పారిపోతున్న నిందితుడు నవీన్‌ను SKLM జిల్లా బూర్జలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత స్పందించారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి విశాఖకు తరలించారు.
News April 2, 2025
సోంపేట: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగనట్లు ఆయన చెప్పారు. ఆమె వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. వివరాలు తెలిస్తే ఈ నంబర్‌ను 9989136143 సంప్రదించాలని ఆయన చెప్పారు.