News March 20, 2025
వట్టిచెరుకూరు: అత్యాచార ఘటనలో వృద్దుడి మృతి

ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో బాలిక బంధువుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్దుడు మృతి చెందాడు. వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరు మండలంలో 2వ తరగతి చదువుతున్న బాలికపై థామస్ (60)అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలిక బంధువులు థామస్‌పై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News March 20, 2025
భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ. 1.14కోట్లు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.1,14,60,041 ఆదాయం వచ్చింది. 293 యూఎస్ డాలర్లు, 50 కెనడా డాలర్లు, వెండి 1262 కిలోలు, 133 గ్రాముల బంగారం వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు.
News March 20, 2025
గద్వాల బార్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక

గద్వాల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్లు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ రావు, ఉపాధ్యక్షుడిగా గుండయ్య, కార్యదర్శిగా షఫీ ఉల్లా, సంయుక్త కార్యదర్శిగా దామోదర్, కోశాధికారిగా విశ్వనాధ్ గౌడ్, గ్రంథాలయం కార్యదర్శిగా మన్యం కొండా, కార్యనిర్వాహక సభ్యులుగా మాధవి లత, వెంకట్ రమణారెడ్డి, శేషిరెడ్డి, మధుసూదన్ బాబును ఎన్నుకున్నారు.
News March 20, 2025
శ్రీ సత్యసాయి: 171 మందికి బదిలీలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 171 మందికి బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ క్యాడర్‌లలో పనిచేస్తున్న వారికి గురువారం బదిలీలు చేపట్టామన్నారు. 21 మంది ఏపీవోలు, 50 మంది కోఆర్డినేటర్స్, 18 మంది ఈసీ, 81 మంది టెక్నికల్ అసిస్టెంట్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు.