News February 27, 2025
వట్లూరు పెద్ద చెరువులో స్నానానికి దిగి ఇద్దరు మృతి

పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 27, 2025
ముగిసిన మహాకుంభ్.. మోదీ ట్వీట్!

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళా నిన్నటితో ముగిసింది. ఈక్రమంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘మహాకుంభ్ ముగిసింది. ఐక్యతతో కూడిన గొప్ప ఆచారం ముగిసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ మహాకుంభ్‌లో 1.4 బిలియన్ల మంది విశ్వాసం ఏకమైంది. గత 45 రోజులుగా దేశ నలుమూలల నుంచి కోట్ల మంది తరలిరావడాన్ని నేను చూస్తూనే ఉన్నా’ అని తన మదిలో మెదిలిన కొన్ని <
News February 27, 2025
సూర్యాపేట: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్‌లోని సూర్యాపేట, కోదాడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.
News February 27, 2025
నిర్మల్ జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో ఉదయం 10 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,206 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 7.04 శాతంగా పోలింగ్ నమోదయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 201 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 10.22 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు.