News November 4, 2025

వట్లూరు వద్ద రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

image

బెంగళూరుకు చెందిన ఉమాశంకర్ (72) యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించారు. మంగళవారం ఉదయం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని వట్లూరు సమీపంలో రైలు నుంచి జారిపడి ఆయన మృతి చెందారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 4, 2025

తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

image

తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు(20) హాస్టల్ టెర్రస్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News November 4, 2025

భవిత సెంటర్‌లను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

దివ్యాంగ పిల్లల విద్యాప్రమాణాలు మెరుగుపరచేందుకు భవిత సెంటర్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం అన్నారు. నవంబర్ 20 నాటికి మరమ్మతులు, పెయింటింగ్, మౌలిక వసతుల పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి సెంటర్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచి, యాక్టివిటీలను రెగ్యులర్‌గా నిర్వహించాలన్నారు. వినూత్న పద్ధతుల్లో బోధన అందించి, స్పష్టమైన మార్పు కనిపించేలా చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News November 4, 2025

చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ సెటైర్లు

image

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై YCP అధినేత జగన్ సెటైర్లు వేశారు. ‘ఇంత విపత్కర పరిస్థితిలో సీఎం ఒక రోజు వస్తాడు. అలా చాపర్‌లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్‌కు పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడటానికి పోతాడు’ అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.