News April 14, 2025
వడగండ్ల వానకు నేలమట్టమైన పంటపొలాలను పరిశీలించిన కొమ్మూరి

పెంబర్తి, పలు గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వానకు నేలమట్టమైన పంటపొలాలను జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం పరమైన సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Similar News
News September 18, 2025
రేపు మంచిర్యాలలో జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా

మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య ఈరోజు తెలిపారు. జిల్లాలోని 18 మండలాల నుంచి మండల స్థాయి టీఎల్ఎం మేళాలో ఎంపికైన 172 మంది ఉపాధ్యాయులు తమ ఎగ్జిబిట్స్‌తో హాజరు కానున్నారని పేర్కొన్నారు. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి ఈ మేళా ఎంతో దోహదపడుతుందన్నారు.
News September 18, 2025
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం జిల్లాలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ డివైజులతో వేలిముద్ర సేకరించారు. నేరాల కట్టడిపై నిఘా, రోడ్ సేఫ్టీ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏదైనా సమస్య వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గాని, డయల్ 100కు గాని ఫిర్యాదు చేయాలన్నారు.
News September 18, 2025
మంథని: అడ్వకేట్ దంపతుల హత్య కేసులో మొదలైన సీబీఐ విచారణ

అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో సీబీఐ అధికారుల బృందం విచారణ మొదలైంది. గురువారం మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో వామనరావు ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వారి వెంట గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పాల్గొన్నారు. సీబీఐ విచారణ ప్రారంభం కావడంతో మంథని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.