News April 8, 2025
వడాలిలో భర్త వేధింపులతో నవవధువు బలవన్మరణం

ముదినేపల్లి మండలం వడాలికి చెందిన గుండాబత్తుల తనుశ్రీ(19) భర్త వేధింపులు తాళలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రూ.20వేలు తీసుకురమ్మని, గతంలో పెట్టిన కేసు రాజీ చేసుకోవాలని తన కుమార్తెను వేధింపులు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తండ్రి తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 7, 2025
వానొస్తే.. ట్రైసిటీ హడల్..!

ఉమ్మడి WGLలో ఇటీవల సంభవించిన వరదలు ట్రైసిటీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షం అంటేనే నాళాల పక్కన ఉన్న కాలనీల ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఏ సమయానికి వరదలు వచ్చి ఇళ్లు మునుగుతాయోనని, ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. WGLలో CM పర్యటించినా, ముంపునకు శాశ్వత పరిష్కారం దొరకలేదని, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మీ కాలనీకి వరద వచ్చిందా?
News November 7, 2025
నిడదవోలులో యాక్సిడెంట్.. యువకుడి మృతి

నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. త్రిబుల్ రైడ్ చేస్తూ వస్తున్న ముగ్గురు యువకులు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 7, 2025
బాలీవుడ్ నటి సులక్షణ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటి, సింగర్ సులక్షణా పండిట్(71) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు లలిత్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో సంగీత విద్వాంసుల కుటుంబంలో ఈమె జన్మించారు. తొలుత సింగర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ‘సంకల్ప్’ మూవీలో పాటకు ఫిలింఫేర్ అందుకున్నారు. ఆ తర్వాత సంజీవ్ కుమార్, రాజేశ్ ఖన్నా, జితేంద్ర, శత్రుఘ్నసిన్హా వంటి ప్రముఖుల సరసన నటించారు.


