News September 7, 2025
వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్‌గా శ్రీదేవి

రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్‌గా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలానికి చెందిన శ్రీదేవిని కూటమి ప్రభుత్వం నియమించింది. మండల పరిధిలోని కొడికొండ చెక్ పోస్టుకు చెందిన శ్రీదేవి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
Similar News
News September 7, 2025
కర్నూలు: నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 2025-26 విద్యాసంవత్సరానికి GNM నర్సింగ్ కోర్సులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. నర్సింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో 22వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారన్నారు.
News September 7, 2025
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ప్రజలకు సూచించారు. ఈనెల 8న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 7, 2025
ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.