News December 28, 2025

వణికిస్తున్న చలి.. పెరిగిన వైరల్ జ్వరాల ఉద్ధృతి

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వేకువజామున వీస్తున్న చలిగాలులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.

Similar News

News December 30, 2025

యూరియా కోసం క్యూలో ఉండక్కర్లేదు: అదనపు కలెక్టర్

image

రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ శిక్షణలో మాట్లాడుతూ.. సాంకేతికతతో పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద 3 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఉదయం 6 గంటల నుంచే విక్రయాలు ప్రారంభించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 30, 2025

రేపటి నుంచి బాల కార్మికుల గుర్తింపు: నల్గొండ ఎస్పీ

image

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపేందుకు ‘ఆపరేషన్ స్మైల్-11’ సిద్ధమైంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇటుక బట్టీలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు నిర్వహించి వెట్టిచాకిరీలో ఉన్న చిన్నారులను రక్షిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

News December 30, 2025

నల్గొండ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.