News December 22, 2025
వణుకుతున్న సంగారెడ్డి జిల్లా

సంగారెడ్డి జిల్లాను చలి చుట్టేసింది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కోహిర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు చేరడంతో జనం గజగజ వణుకుతున్నారు. సత్వార్, మొగుడంపల్లి, దిగ్వాల్, నిజాంపేట వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సిర్గాపూర్, నాగల్‌గిద్ద, పుల్కల్, మల్చల్మాలోనూ ఇదే పరిస్థితి ఉంది. చలి తీవ్రతకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం మంచు కురుస్తోంది.
Similar News
News December 29, 2025
FLASH: నాగర్ కర్నూల్ లో మరోసారి ఎన్నికలు

నాగర్ కర్నూల్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✒నాగర్ కర్నూల్- 24 వార్డుల్లో 36,912 మంది
✒కల్వకుర్తి-22, వార్డుల్లో 30,091 మంది
✒కొల్లాపూర్-19 వార్డుల్లో 23,041 మంది ఉన్నారు.
ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.
News December 29, 2025
నిజామాబాద్: నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ కిరణ్

నిజామాబాద్ పట్టణానికి చెందిన శ్రీనికేష్ కిరణ్ 2025-26 సంవత్సరానికి నిర్వహించిన నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. బెస్ట్ స్విమ్మర్ అవార్డును అందుకోవడం భారతదేశానికి గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.
News December 29, 2025
PHOTOS: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం

AP: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈ దర్శనాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి 12 గం. వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 10రోజుల్లో దర్శనానికి మొత్తం 180 గంటల సమయం ఉంటే.. దానిలో టీటీడీ సామాన్యులకే 164 గంటలు కేటాయించింది. వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైన తిరుమల ఆలయ ఫొటోలను పైన ఉన్న గ్యాలరీలో చూడొచ్చు.


