News March 24, 2026

వనపర్తిలో ఎండల తీవ్రత!

image

వనపర్తి జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో వెలుగొండలో అత్యధికంగా 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడలో 38.6 డిగ్రీలుగా రికార్డయ్యాయి. జిల్లాలోని 21 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News March 29, 2026

VZM: రేపు PGRS రద్దు

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన బడ్జెట్ అవుట్‌రీచ్ 2026-27 సమీక్ష, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ (DRC) సమావేశం, పీ-4 కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News March 29, 2026

సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వండి: మార్కాపురం కలెక్టర్

image

మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.

News March 29, 2026

మంగళగిరిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

image

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. CM చంద్రబాబు ఈ ఉత్సవాల్లో పాల్గొని, పార్టీ భారీ జెండాను ఆవిష్కరించారు. NTR విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ ప్రస్థానాన్ని, భవిష్యత్తు లక్ష్యాలను CBN వివరించారు. కార్యక్రమంలో TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.