News December 31, 2025

వనపర్తిలో మరోసారి ఎన్నికలు.!

image

వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✓ వనపర్తి- 33 వార్డుల్లో 70,416 మంది జనాభా
✓ పెబ్బేరు- 12 వార్డుల్లో 15,602 మంది
✓ కొత్తకోట- 15 వార్డుల్లో 19,042 మంది
✓ ఆత్మకూర్- 10 వార్డుల్లో 15,039 మంది
✓ అమరచింత- 10 వార్డుల్లో 11,225 మంది.
ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.

Similar News

News January 1, 2026

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంత మద్యం తాగారో తెలుసా?

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. డిసెంబరులో రూ.279 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది కంటే రూ.51 కోట్లు అదనంగా ఆదాయం రావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో 3.20 లక్షల ఐఎంఎల్, 1.44 లక్షల బీరు పెట్టెలు సరఫరా అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది.

News January 1, 2026

ఖమ్మం: ఎన్పీడీసీఎల్ ఉత్తమ అధికారుల ర్యాంకులు

image

నవంబర్ నెలకు సంబంధించి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన అధికారుల ర్యాంకులను సంస్థ ప్రకటించింది. అర్బన్ విభాగంలో ఏడీఈ నాగార్జున, ఏఈ తిరుపయ్య, రూరల్ విభాగంలో ఏఈ అనిల్ కుమార్ ర్యాంకులు సాధించారు. సర్కిల్ స్థాయిలో డీఈ రాములు, ఏడీఈ యాదగిరి, రామారావు, ఏఈ రవికుమార్, అబ్దుల్ ఆసీఫ్ ప్రతిభ కనబరిచారు. విధి నిర్వహణలో ప్రతిభ చాటిన అధికారులను పలువురు అభినందించారు.

News January 1, 2026

సంగారెడ్డి: ఆర్థిక పునరావసం కింద దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉపాధి, పునరావాస పథకాల కింద దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి బుధవారం కోరారు. దారిద్య్రరేఖకు దిగువన ఉండి, 18 నుంచి 55 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తులను ఈనెల 9లోగా కలెక్టరేట్‌లోని సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.