News March 21, 2025
వనపర్తిలో వ్యక్తికి జైలు శిక్ష

ప్రజలు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దని వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వనపర్తికి చెందిన రమేశ్ నాయక్ అనే వ్యక్తిని గురువారం కోర్టులో హాజరు పరచగా.. అతడికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించామని తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
Similar News
News February 26, 2026
ADB: గిరిజన భూములపై గిరిజనేతరుల ‘పాగా’

షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూములకు రక్షణ లేకుండా పోతోంది. 1/70 చట్టం అమలులో ఉన్నా ఉమ్మడి జిల్లాలోని భూములను గిరిజనేతరులు కబ్జా చేస్తున్నారు. గిరిజనుల పేర్లతోనే బినామీ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తూ సుమారు 1000 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. ITDA, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో గిరిజన హక్కులు కాలరాస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 26, 2026
మార్చి 1 నుంచి సెస్ వసూలు.. పెరగనున్న వాహనాల ధరలు

TG: మార్చి 1 నుంచి నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నట్లు రవాణాశాఖ GO జారీ చేసింది. బైకులకు రూ.2వేలు, ఫోర్ వీలర్లకు రూ.5వేలు, ఇతర వాహనాలకు రూ.10వేలు సెస్‌గా నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ సమయంలో దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో TG ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం సమకూరనుంది. రూల్స్ ప్రకారం ఈ నిధులను రోడ్డు ప్రమాదాల నివారణకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
News February 26, 2026
RRRను సీబీఐ అరెస్ట్ చేయాలి.. ఐపీఎస్ డిమాండ్!

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు(RRR) బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టారని ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఆరోపించారు. ఈ కుంభకోణాలపై ఇప్పటికే సీబీఐ కేసులు ఉన్నాయని, ఆయన బయట ఉంటే సాక్షులను భయపెట్టి కేసులను పక్కదారి పట్టించే అవకాశం ఉందని గురువారం పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రఘురామను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని ట్విట్టర్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు.


