News February 27, 2026

వనపర్తి: అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ బాధ్యతలు

image

వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఖీమ్యా నాయక్ ఐఏఎస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, వేగానికి ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి గడువు పెంపు

image

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు అప్లై చేయడానికి మార్చి 15 వరకు గడువును పొడిగించారు. మేనేజర్, AVP ఫైనాన్స్& అకౌంట్స్, స్టేట్ హెడ్ రిటైల్ బ్రోకింగ్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు careers@bobcaps.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, PG/CA/MBA అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in

News February 28, 2026

పెసర, మినుము సాగులో ఇవి గుర్తుంచుకోండి

image

వేసవి పంటలుగా పెసర, మినుములను మార్చి-15 వరకు విత్తుకోవచ్చు. ఈ సమయంలో విత్తితే పూత, పిందె దశల్లో అధిక ఉష్ణోగ్రతల వలన పంట దెబ్బ తినకుండా మంచి దిగుబడులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు సాగు చేయాలనుకునే మినుము, పెసర రకాల విత్తనాల విషయంలో జాగ్రత్త వహించాలి. తక్కువ కాలంలో కాపునకు వచ్చి బెట్టను, వేడిని, రసంపీల్చే పురుగులు, వైరస్ తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడినిచ్చేవిగా ఉండాలి.

News February 28, 2026

శ్రీకాకుళంలో డయేరియాకి ‘ఈ-కోలీ’ కారణం.. ఎలా సోకుతుంది?

image

AP: శ్రీకాకుళంలో <<19233385>>డయేరియా<<>> విజృంభణకు ‘ఈ-కోలీ’ బాక్టీరియా కారణమని అధికారులు నిర్ధారించారు. నీటి నమూనాల్లో 11 చోట్ల ఈ-కోలీ ఉన్నట్లు గుర్తించామన్నారు. నిన్నటి వరకు 162 కేసులు నమోదవగా 112 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా మనుషుల ప్రేగుల్లో ఉండే ఈ బాక్టీరియా జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే కలుషితమైన ఫుడ్, నీరు తీసుకున్నప్పుడు విరేచనాలు, వాంతులకు కారణమవుతుంది.