News February 15, 2025
వనపర్తి: అద్భుత చిత్రం.. ఆలోచింపజేద్దాం!

విద్యార్థుల ఆశయాలకు అనుగుణంగా వారికి కొత్త ఆలోచనలు, ప్రేరణ కలిగించే విధంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి గర్ల్స్ హై స్కూల్ గోడలపై అందమైన చిత్రలేఖనం చేయించారు. విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలను పొందిన జ్ఞానాన్ని మర్చిపోకుండా ఈ బొమ్మలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ బొమ్మలు విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వచ్చేలా చేయడంలో ఎంతో ప్రభావితం చేస్తున్నాయి.
Similar News
News February 21, 2026
AUSWతో మ్యాచ్.. భారత్ స్కోర్ 176/6

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ 176/6 స్కోర్ చేసింది. స్మృతి మంధాన 55 బంతుల్లో 82(8 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా 59, రిచా ఘోష్ 18, షెఫాలీ వర్మ 7 రన్స్ చేశారు. టీమ్ ఇండియా చివరి 9 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. 3 టీ20ల సిరీస్‌లో IND, AUSలు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.
News February 21, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,580
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,334
* 10 గ్రాముల వెండి ధర రూ.2,680.
News February 21, 2026
చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం: సీఎం చంద్రబాబు

AP: YCP పాలనలో 108L మె.ట.ల చెత్త పేరుకుపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని CM CBN ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే చెత్తను తొలగిస్తున్నామన్నారు. పల్నాడు(D) వినుకొండలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’లో ఆయన ప్రసంగించారు. ‘మున్సిపాలిటీల్లో 97% చెత్త సేకరిస్తున్నాం. గ్రామాల్లో మార్చికల్లా 100% డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తాం. ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం’ అని పేర్కొన్నారు.


