News March 29, 2025

వనపర్తి: అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు.. పోలీసుల WARNING

image

పాలమూరు పరిధి MBNR, NGKL, WNP, GDWL, NRPT జిల్లాల్లో పోక్సో చట్టంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అమ్మాయిలను వేధించినా.. అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీటీమ్ సభ్యుల నిఘా ఉంటుందన్నారు. ఆకతాయి పనులు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. బాలికలు, యువతులు, మహిళలు వేధింపులకు గురైతే 100కు కాల్ చేయాలని సూచించారు. SHARE IT

Similar News

News October 31, 2025

సత్య మూవీపై జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

image

సత్య(1998) మూవీ గురించి JD చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో తన క్యారెక్టర్‌ను చంపేయడం పెద్ద మిస్టేక్ అని డైరెక్టర్ వర్మ చెప్పినట్లు తెలిపారు. ‘ముగింపు ఇంకోలా ఉంటే బాగుండేదని RGV ఇటీవల అభిప్రాయపడ్డారు. కానీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఆ సినిమా ఎండింగ్‌ను మారుస్తానంటే ఇప్పుడు ఎవరూ ఒప్పుకోరని అన్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తన కెరీర్‌లో సత్య టర్నింగ్ పాయింట్‌గా మారిందని JD చెప్పారు.

News October 31, 2025

కార్తీక మాసానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభం

image

కార్తీకమాసంలో శైవక్షేత్రాలను దర్శిస్తే అపారమైన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లా ఆర్టీసీ అధికారులు పంచారామాలు, అరుణాచలం, యాగంటి, మహానంది, శ్రీశైలం, మంత్రాలయం, వాడపల్లి వంటి ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళికలు రూపొందించారు.

News October 31, 2025

చిత్తూరులో ఐదుగురికి ఉరిశిక్ష.. రేరెస్ట్ ఆఫ్ ది రేర్

image

చిత్తూరులో అనురాధ దంపతుల <<18160618>>హత్య <<>>కేసు ‘రేరెస్ట్ ఆఫ్ ది రేర్’ అంటూ కోర్టు ఐదుగురికి ఉరిశిక్ష వేసింది. ఒకే కేసులో ఐదుగురికి ఉరిశిక్ష వేయడం దేశంలోనే అరుదైన విషయం. గోద్రా రైలు దహన ఘటన కేసులో ట్రయల్ కోర్టు 11 మందికి ఉరి శిక్ష విధించినా.. ఆ తర్వాత యావజ్జీవ శిక్షగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన బాలికపై అత్యాచారం, ఇద్దరి హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడినా.. అప్పీల్‌కు వెళ్లడంతో ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.