News March 3, 2025
వనపర్తి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి చేస్తా: సీఎం

వనపర్తి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వనపర్తికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఐదేళ్ల క్రితం వనపర్తి లో గెలిచిన MLA రాజకీయాలను కలుషితం చేశారన్నారు. వనపర్తి లో అనేక విద్యాసంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే పునాది వేశాయని తెలిపారు. వనపర్తిలో నేను నేర్చుకున్న రాజకీయ చైతన్యం తోనే తెలంగాణ CMగా మీ ముందు నిలబడ్డానని అన్నారు.
Similar News
News December 22, 2025
తెలుగు కళల వైభవం చాటేలా ‘ఆవకాయ’ ఫెస్టివల్: కందుల

AP: తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ పేరిట సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘AP వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా కళాకారులకు ఈ ఉత్సవం గొప్ప వేదికగా నిలుస్తుంది. అలాగే ఉగాదికి నంది అవార్డులు ఇస్తాం. నాటకోత్సవాలు నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.
News December 22, 2025
భద్రాద్రి: అరుదైన ఆపరేషన్.. అభినందించిన ఎమ్మెల్యే, కలెక్టర్

కొత్తగూడెంలో నూడిల్స్ బండి నడిపే పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిశాల్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లోతుగా తెగడంతో ఆశలు వదులుకున్నారు. గొంతు స్పెషలిస్ట్ డా.రవిబాబు 2 గంటలు శ్రమించి పాల్వంచ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. భద్రాచలం ఐసీయూలో రెండు వారాలు చికిత్స అందించి సోమవారం డిశ్చార్జ్ చేశారు. రవిబాబుతో పాటు పాల్వంచ, భద్రాచలం ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
News December 22, 2025
వివాదాలపై వెంటనే చర్యలు తీసుకోండి : SP

అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమంలో భాగంగా SP ధీరజ్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సివిల్, కుటుంబ, ఆస్తి వివాదాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన దివ్యాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగుల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.


