News April 3, 2025

వనపర్తి: ‘ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని పునః సమీక్షించండి’

image

ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని(AEBAS) తక్షణమే పునః సమీక్షించాలని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇతర ప్రత్యామ్నాయ హాజరు విధానాన్ని అనుమతించాలని కోరుతూ గురువారం వనపర్తి డీఎంహెచ్‌వో శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల వాస్తవ సమస్యలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

Similar News

News April 4, 2025

సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

image

AP: రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన <<15986572>>అగ్నిప్రమాదం<<>>పై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్‌లో ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫైర్ ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

News April 4, 2025

పెద్దపల్లి: మట్టి మాఫియాపై చర్యలేవి?: గొట్టెముక్కుల

image

పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా పెరిగిపోయిందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు గొట్టెముక్కుల సురేశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం వస్తున్నా మౌనం పాటించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News April 4, 2025

గజపతినగరం: చెట్టు పైనుంచి జారిపడి ఒకరి మృతి

image

గజపతినగరం మండలంలో తాటి చెట్టు పైనుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన భోగాది సత్యం (50) కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు పైనుంచి జారిపడి మృతి చెందినట్లు సత్యం భార్య భోగాది లక్ష్మి శుక్రవారం తెలిపారు. గజపతినగరం ఎస్సై లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని లక్ష్మీ వాపోయారు.

error: Content is protected !!