News October 20, 2025

వనపర్తి: ఆనందోత్సాహాలతో దీపావలి జరుపుకోవాలి: కలెక్టర్

image

దీపావళి పర్వదినాన్ని వనపర్తి జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకాంక్షించారు. దీపావళి పండుగ అంటే దుష్టశక్తులపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా పండుగను జరుపుతామన్నారు. అలాగే బాణసంచా విషయంలో పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తత వహించాలన్నారు.

Similar News

News October 20, 2025

WGL: ‘ఏసీబీ పేరుతో కాల్స్‌ వస్తే నమ్మొద్దు’

image

ACB పేరుతో పలు ఫోన్ నంబర్లు నుంచి కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారని, వాటిని నమ్మవద్దని వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. కొందరు ఏసీబీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏసీబీ ఎవరికి కాల్స్ చేసి డబ్బులు అడగదని, ఎవరికైనా అలాంటి కాల్స్ వస్తే PSలో పిర్యాదు చేయాలన్నారు. 9886826656, 9880472272, 9591938585 నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి జాగ్రత్త.

News October 20, 2025

రాజధానికి పల్నాడు కనెక్ట్..!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పల్నాడు జిల్లా రాష్ట్ర రాజధానికి కనెక్ట్ కానున్నది. పెదనందిపాడు మండలంలోని ముసాపురం, తాటిబండ్ల, తాళ్లూరు, అమరావతి మండలంలోని ధరణికోట, లింగాపురం, దిడుగు గ్రామాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దగా 190 కిలోమీటర్ల విస్తీర్ణంతో నేషనల్ హైవేస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమరావతి రింగ్ రోడ్డును నిర్మిస్తుంది.

News October 20, 2025

BNGR: టార్గెట్ రీచ్ అవుతారా..!

image

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. అయితే వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో 82 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (2,649) దరఖాస్తులు రాగా గతేడాది (3,900) దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.