News January 2, 2026
వనపర్తి: ‘ఆపరేషన్ స్మైల్‌తో బాలకార్మికుల నిర్మూలన’

ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కీలక పాత్ర పోషిస్తామని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ చెప్పారు. 2025 సంవత్సరంలో వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలు గణనీయంగా పురోగతిని సాధించాయని చెప్పారు. జిల్లా యంత్రాంగం, ఆయా శాఖల అధికారులతో కలిసి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు విశేషంగా కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు.
Similar News
News January 2, 2026
MBNR: TG TET.. బందోబస్తు ఏర్పాటు: SP

MBNR జిల్లాలో TG TET దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP డి.జానకి తెలిపారు. పరీక్ష రోజుల్లో ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News January 2, 2026
ఇతిహాసాలు క్విజ్ – 115 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడిని బంధించిన వానర రాజు ఎవరు? తన శక్తితో ఆ రాజు రావణుడిని ఏం చేశాడు?
సమాధానం: రావణుడిని బంధించిన వానర రాజు వాలి. రావణుడు తనను యుద్ధానికి ఆహ్వానించినప్పుడు ధ్యానంలో ఉన్న వాలి చంకలో నొక్కి పట్టుకున్నాడు. 6 నెలల పాటు బందీగా ఉంచుకుని, 4 సముద్రాల మీదుగా ఆకాశంలో విహరించాడు. వాలి బలం ముందు రావణుడి పప్పులు ఉడకలేదు. చివరికి రావణుడు తన ఓటమిని అంగీకరించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 2, 2026
ఈ ఏడాది అత్యధిక పెట్టుబడులు APలోనే: లోకేశ్

AP: FY2026లో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో అత్యధికం ఆంధ్రాకే దక్కినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. AP(25.3%) అగ్రస్థానంలో తర్వాత ఒడిశా(13.1%), మహారాష్ట్ర(12.8%), TG(9.5%) ఉన్నాయని తెలిపింది. ‘FY2026లో రాష్ట్రానికి 25.3% పెట్టబుడులు వచ్చాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చూడటానికి ఇలాగే ఉంటుంది. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది’ అని ట్వీట్ చేశారు.


