News February 11, 2025
వనపర్తి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739253956075_1292-normal-WIFI.webp)
కొత్తకోట మున్సిపాలిటీలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. దేవరకద్ర మండలం గుడిబండకి చెందిన విగ్నేశ్వర్ రెడ్డి(50) కొత్తకోటలోని అంబభవాని మాత ఉత్సవాలకు వచ్చారు. బైక్‌పై చౌరస్తాకు వెళ్తుండగా.. వనపర్తి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విగ్నేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
Similar News
News February 11, 2025
దేశంలో ‘శాంసంగ్’ డౌన్.. టాప్‌లో వివో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739272713062_695-normal-WIFI.webp)
దేశీయ మార్కెట్‌లో శాంసంగ్ హవాకు బ్రేక్ పడింది. 2024లో ఆ సౌత్ కొరియా కంపెనీ వాటా 17 నుంచి 13.2 శాతానికి పడిపోయి రెండో స్థానంలో నిలిచింది. వివో(చైనా) 15.2 నుంచి 16.6 శాతానికి చేరి టాప్‌లో నిలిచినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వెల్లడించింది. ఐఫోన్ మార్కెట్ 6.4 నుంచి 8.2 శాతానికి చేరినట్లు తెలిపింది. 3-10 స్థానాల్లో వరుసగా OPPO, షియోమీ, రియల్‌మి, ఆపిల్, మోటొరోలా, POCO, వన్‌ప్లస్, ఐక్యూ ఉన్నాయంది.
News February 11, 2025
MBNR: ఎన్నికల నిర్వహణపై శిక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739271946460_51916297-normal-WIFI.webp)
ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాస్టర్ ట్రైనర్లుగా నియమించిన వారు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణ నిబంధనలపై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం ZP సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయి ట్రైనర్లకు ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
News February 11, 2025
నాంపల్లి: జబల్‌పూర్ ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739273314430_718-normal-WIFI.webp)
జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.