News February 24, 2026
వనపర్తి: ఇంటర్, పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.
Similar News
News February 24, 2026
సర్క్యులర్ ఎకానమీతో 10 మిలియన్ల ఉద్యోగాలు: పట్టాభిరామ్

విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడారు. 2050 నాటికి సర్క్యులర్ ఎకానమీ ద్వారా 10 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులు, వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ హరేంధీర ప్రసాద్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించగా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు.
News February 24, 2026
నల్గొండ: డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు లాస్ట్ ఛాన్స్

మహాత్మా గాంధీ వర్సిటీ పరిధిలోని 2019-21 బ్యాచ్ డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించేందుకు వర్సిటీ చివరి అవకాశం కల్పించింది. ఎలాంటి జరిమానా లేకుండా మార్చి 16 వరకు, రూ.100 జరిమానాతో మార్చి 17 వరకు ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
News February 24, 2026
VZM: ఈరోజు పరీక్షకు 515 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షను 19,483 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 18,968 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 515 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు.


