News February 24, 2026
వనపర్తి: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం 633 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు మంగళవారం వెల్లడించారు.
Similar News
News February 25, 2026
హనుమకొండలో కాంగ్రెస్ కార్పొరేటర్ అరెస్టు

హనుమకొండ 5వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయమై ఒకరిపై హత్యాయత్నం కేసులో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ పోలీసులు శ్రీమన్‌ను ఇంటివద్దే అదుపులోకి తీసుకున్నారు.
News February 25, 2026
మాఫియాలను ఏలి ప్రభుత్వాలను పరిగెత్తించారు.. కానీ!

మెక్సికన్ డ్రగ్ కార్టెల్‌కు బాస్, ₹130కోట్ల రివార్డ్ ఉన్న ‘ఎల్ మెంచో’ <<19224610>>గర్ల్‌ఫ్రెండ్<<>> వల్ల దొరికి హతమయ్యాడు. లాటిన్ అమెరికా అండర్‌వరల్డ్ చరిత్రకు ఇది కొత్తేం కాదు. 2025లో లూయిస్ పికాడో భార్య చేసిన సోషల్ మీడియా పోస్ట్‌తో చిక్కాడు. 2022లో భార్య ఫేస్‌బుక్‌లో సెల్ఫీ పోస్ట్ చేయడం ఎల్ పిట్ కొంపముంచింది. ఇలా పెద్ద మాఫియాలను నడిపి ప్రభుత్వాలకు ఏళ్లుగా దొరకని వాళ్లు ప్రియురాళ్ల లింక్‌తో దొరికిపోతున్నారు.
News February 25, 2026
కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం: ఆదిలాబాద్ MLA

విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.


