News January 5, 2026
వనపర్తి: ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష

వనపర్తి DIEO ఎర్రఅంజయ్య సోమవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశంను నిర్వహించారు. డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్ ప్రాక్టికల్స్ జిల్లాలో జనవరి 21న ప్రారంభమవుతున్నందున పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, ల్యాబ్ ఏర్పాట్లు, విద్యార్థుల నామినల్ రోల్స్ చెక్ చేయడం వంటివాటిపై చర్చించి తగుచర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించినట్లు తెలిపారు.
Similar News
News February 17, 2026
ఏఐ సమ్మిట్‌లో గందరగోళం!

ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక ఏఐ సమ్మిట్‌లో నిర్వహణ, ఏర్పాట్లపై గందరగోళం నెలకొంది. తమ ఆవిష్కరణను ప్రదర్శించేందుకు వచ్చిన ఓ స్టార్టప్ ఫౌండర్‌కు నిన్న చేదు అనుభవం ఎదురైంది. ప్రధాని విజిట్ నేపథ్యంలో సెక్యూరిటీ సూచన మేరకు తమ డివైజ్‌లు అక్కడ విడిచి వెళ్లామని.. తిరిగొచ్చేసరికి అవి చోరీకి గురయ్యాయని వాపోయారు. మరోవైపు క్రౌడ్ మేనేజ్మెంట్, ఏర్పాట్లపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News February 17, 2026
శ్రీకాకుళం: బాలికతో అసభ్య ప్రవర్తన.. ఏడాది జైల్లోనే

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్.సునీత తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మందస(M) ఓ గ్రామానికి చెందిన బాలికను అదే మండలానికి చెందిన కొర్రాయి తిరుపతి రెండేళ్లుగా వెంటపడుతూ, బాలిక పాఠశాల నుండి వస్తున్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లితండ్రులు ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదయినట్లు చెప్పారు.
News February 17, 2026
అనకాపల్లి: 3,11,885 మందికి ఆల్బెండజోల్ టాబ్లెట్స్

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయసుగల బాల బాలికలు 3,11,885 మందికి ఆల్బెంజోల్ టాబ్లెట్స్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DM&HO డాక్టర్ హైమావతి తెలిపారు. జిల్లాలో 1,908 అంగన్వాడీ కేంద్రాలు,1,856 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అనంతరం టాబ్లెట్స్ దగ్గర ఉండి వేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.


