News November 13, 2025

వనపర్తి: ఈనెల 23న పాలమూరులో బీసీల రణభేరి

image

బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 23న పాలమూరులో బీసీల రణభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఛైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు. అయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, బీసీ మహిళలకు సబ్‌కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం ఈ రణభేరి చరిత్రాత్మక పోరాటానికి నాంది కానుందని తెలిపారు.

Similar News

News November 13, 2025

ఊట్కూర్: వే2న్యూస్ ఎఫెక్ట్.. PHC కూల్చివేతకు ఆదేశాలు

image

ఊట్కూర్ మండల కేంద్రంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారింది. ‘శిథిలావస్థగా PHC భవనం..’Way2News’ ఫోకస్! ‘ శీర్షికతో ఈ నెల 1న కథనం ప్రచురితమైంది. గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పాత భవన నాణ్యతను నిపుణులతో పరిశీలించి ధ్రువీకరించిన అనంతరం కూల్చివేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించింది.

News November 13, 2025

హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్‌లతో రైళ్లు!

image

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్‌లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్‌లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్‌లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.

News November 13, 2025

వైజాగ్‌కు మదర్‌సన్ ఐటీ కంపెనీ

image

మదర్‌సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ (MTSL) కంపెనీ ₹109.73 కోట్ల పెట్టుబడితో వైజాగ్‌లో ఐటీ R&D, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు AP ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధురవాడ (కాపులుప్పాడ ఐటీ పార్క్)లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా AI/ML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో 700 ఉద్యోగాలు వస్తాయి. AP IT & GCC పాలసీ 4.0 కింద G.O.MS.No. 61 (12-11-2025) జారీ చేసింది.