News December 23, 2025

వనపర్తి: ఈనెల 24న ఉమ్మడి శిబిరం.. పెండింగ్ ఖాతాదారులకు అవకాశం..!

image

పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన ఖాతాదారుల బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ షేర్ డబ్బులు తిరిగి పొందేందుకు రిజర్వు బ్యాంక్ మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టరేట్లోని IDOCలో ఈనెల 24న బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలతో ఉమ్మడి శిబిరం ఏర్పాటు చేశామని, జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 23, 2025

వైద్యం ప్రైవేట్ పరమైతే ఊరుకోం: బొత్స

image

మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలన్నది తమ పార్టీ విధానమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే వైసీపీ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని విమర్శించారు.

News December 23, 2025

GNT: ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా క్రైస్తవ కళాశాల

image

గుంటూరు నగర గుండెకాయలాంటి ఆంధ్రా క్రైస్తవ కళాశాల దేశ విద్యా చరిత్రలో ఒక ధ్రువతార. 1885లో ప్రొటెస్టంట్ మిషనరీల సారథ్యంలో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ, 135ఏళ్లకు పైగా నిరంతర విద్యాదానం చేస్తోంది. విశ్వవిఖ్యాత నటుడు NTR, మాజీ CM కాసు బ్రహ్మానందరెడ్డి వంటి మహామహులు ఇక్కడే తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఎందరో మేధావులను, రాజనీతిజ్ఞులను సమాజానికి అందించిన ఘనత ఈ చారిత్రక కళాశాలకు దక్కుతుంది.

News December 23, 2025

BHPL: హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు

image

హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ BHPL కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాటారం(M) గంగారంలో భూమి తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో 9 మందికి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ న్యాయస్థానం, BHPL న్యాయమూర్తి సీహెచ్ రమేశ్ బాబు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
నిందితులు: మహంకాళి నాయక్, భాస్కర్ నాయక్, సర్దార్ నాయక్, బాపు నాయక్, కౌసల్య, సారయ్య నాయక్, బాబు నాయక్, సమ్మయ్య అజ్మీర రాజ్ కుమార్.