News December 24, 2025

వనపర్తి: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, ఘన్‌పూర్, కొత్తకోట, మదనాపూర్, పెద్దమందడి, రేవెల్లి, వీపనగండ్ల మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే <>ఇక్కడ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.<<>>

Similar News

News December 24, 2025

శని దోషమా? ఇవి దానం చేయండి..

image

పుష్య మాసంలో చేసే చిన్న దానమైనా శని దోషాల నుంచి విముక్తి కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. జాతకంలో శని ప్రభావం ఉన్నవారు అన్నదానం, వస్త్రదానం చేయాలంటున్నారు. ‘చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో కంబళ్లు, దుప్పట్లు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శని దేవుడికి ప్రీతికరమైన ఈ మాసంలో కొన్ని సరళమైన పరిహారాలతో శని బాధలను తగ్గించుకోవచ్చు’ అంటున్నారు. ఆ పరిహారాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News December 24, 2025

విత్తనాలు కొనేటప్పుడు రశీదు కీలకం

image

విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుంచి కొనుగోలు రశీదు తప్పకుండా తీసుకోవాలి. దీనిపై రైతు మరియు డీలర్ సంతకం తప్పకుండా ఉండాలి. పంటకు విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే ఆ రశీదును పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత రాకపోతే నష్టపరిహారానికి రశీదు అవసరం.

News December 24, 2025

కోస్గి సభతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి

image

నేడు నారాయణపేట జిల్లా కోస్గిలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సభపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ మరో 20 రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో సభ నిర్వహిస్తామని ప్రకటించడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కోస్గి వేదికగా సీఎం ఏం మాట్లాడతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల సభలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.