News July 8, 2025

వనపర్తి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు ఈనెల 13 వరకు http://national awardstoteachers.education.gov.in సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News July 9, 2025

పాత వాహనాలకు నవంబర్ 1 వరకే ఛాన్స్

image

పాత వాహనాలకు ఫ్యూయెల్ బ్యాన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాన్స్ నవంబర్ 1 వరకేనని తాజాగా వెల్లడించింది. ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టంలో సమస్యలే ఇందుకు కారణమంది. కాగా పదేళ్లు దాటిన డీజిల్, 15ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు ఫ్యూయెల్ బ్యాన్ చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీతో పాటు సమీప 5 ప్రాంతాల్లో NOV 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి రానుంది.

News July 9, 2025

హనుమకొండ: వడ్ల బస్తాల లోడ్ లారీ దగ్ధం

image

వడ్ల బస్తాల లోడ్‌తో ఉన్న లారీ దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ దగ్గర ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ నుంచి హనుమకొండ వైపు వడ్ల బస్తాల లోడ్‌తో వస్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది. డ్రైవర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయట పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంటలు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

News July 9, 2025

ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకు?: KTR

image

TG: చర్చకు వచ్చే ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని ఆయనే సవాల్ విసిరారు. నేను దాన్ని స్వీకరించి, 72 గంటల నోటీస్ ఇచ్చా. ఇవాళ అందరి సమక్షంలో గంటపాటు వేచి చూసినా ఆయన రాలేదు. ఇంతమాత్రం దానికి సవాల్ విసరడం ఎందుకు రేవంత్ రెడ్డి?’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.