News January 27, 2025

వనపర్తి: ఉత్తీర్ణత, హాజరు శాతం పెంచేందుకు చర్యలు

image

వనపర్తి జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థుల ఉత్తీర్ణత, హాజరు శాతం పెంచేందుకు ఇంటర్ విద్య చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో అకాడమిక్ సెల్ ఏర్పాటు చేశారు. ముగ్గురుని సభ్యులుగా నియమించారు. ఈ బృందం అకాడమిక్ విషయాలను పరిశీలిస్తుందని జిల్లా ఇంటర్ అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రయోగ పరీక్షలు, మార్చి 5 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News January 28, 2025

బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్

image

TG: గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ పేరు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

News January 28, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రైమ్ న్యూస్

image

ఎల్లారెడ్డిపేట మండలంలోని ఐదు తండాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు..300 లీటర్స్ బెల్లం పానకం, 10 లీటర్స్ నాటుసారా ధ్వంసం @కిసాన్ దాస్ పేటలో చోరీ విఫలయత్నం @రుద్రంగి మండల కేంద్రంలో మళ్ళీ దొంగల బీభత్సం..రూ. 10వేలు చోరీ @ఎల్లారెడ్డిపేటలో వీడని మూఢనమ్మకాలు @ఎల్లారెడ్డిపేలో దొంగల బీభత్సం..రూ.30వేల అపహరణ @తంగళ్ళపల్లిలో దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం.

News January 28, 2025

నిద్రపోయే ముందు ఇలా చేయట్లేదా?

image

శరీరం డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉండాలంటే తగినంత నీరు అవసరం. రోజును గ్లాసు నీళ్లతో ప్రారంభించడమే కాకుండా నిద్ర పోయే ముందూ గ్లాసు నీరు తాగడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుందంటున్నారు. అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నవారు గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.