News November 11, 2025
వనపర్తి: ‘ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’

వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ (CO-ED) కళాశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
రేపు సామూహిక గృహప్రవేశాలు.. పాల్గొననున్న సీఎం

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజావేదికలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతోనూ ముచ్చటిస్తారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా గత నెలలోనే సీఎం పర్యటించాల్సి ఉన్నా భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది.
News November 11, 2025
ఇతిహాసాలు క్విజ్ – 63 సమాధానాలు

ప్రశ్న: కర్ణుడిని, పరశురాముడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు?
జవాబు: పరశురాముడు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాడు. కర్ణుడు తాను క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పి, శిష్యుడిగా చేరి రహస్య విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఓనాడు కర్ణుడి అసలు రూపం తెలియగానే ‘నువ్వు నా దగ్గర నేర్చుకున్న బ్రహ్మాస్త్రాది విద్యలన్నీ, నీకు అవసరమైన సమయంలో జ్ఞాపకం రాకుండా పోవుగాక!’ అని శపించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 11, 2025
MBNR: ‘ధాన్యం కేంద్రాల వద్ద ఇబ్బందులు ఉండొద్దు’

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం మూసాపేట మండలం తిమ్మాపూర్, కొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కల్పించిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ ఆరా తీశారు.


