News March 26, 2025
వనపర్తి: ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ: బచ్చు రాము

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుందని జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు బచ్చు రాము అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో బచ్చు రాము మాట్లాడుతూ.. ఉగాది పండుగ నుంచి ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయనుందని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, డీఎస్ఓ, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 7, 2026
అమరావతిలో తొలి భూ సేకరణ నేటి నుంచే..!

అమరావతిలో తొలిసారి భూసేకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి పూలింగ్‌కు ఇవ్వని సుమారు 4.5 ఎకరాల భూమిని భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బుధవారం భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఫిబ్రవరి చివరి నుంచి స్టీల్ బ్రిడ్జీ అందుబాటులోకి రానుండటంతో ప్రజలకు కనెక్టివిటీ అందించేందుకు భూ సేకరణ చేపడుతున్నామని మంత్రి నారాయణ ఇప్పటికే తెలిపారు.
News January 7, 2026
విలీనం దిశగా WGL, HNK జిల్లాలు!

WGL, HNK రెండు జిల్లాల విలీనానికి రెడీ అవుతున్నారా? అంటే అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన మాటలు బలం చేకూరుస్తున్నాయి. నియోజకవర్గాలు రెండు జిల్లాలో ఉండటం మూలంగా ఇబ్బంది పడుతున్నట్టు సభ్యులు ప్రశ్నించడంతో, త్వరలోనే జిల్లాల పున: విభజనను పరిశీలిస్తామని, ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ఉండేలా చేస్తామని మంత్రి ప్రకటించారు. దీంతో రెండు జిల్లాల విలీనం తప్పదని నేతలంటున్నారు.
News January 7, 2026
విజయవాడ: పిల్లల విక్రయాల కేసులో ఇద్దరు అరెస్ట్

విజయవాడలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితురాలు సరోజినీ వెల్లడించిన వివరాలతో ముంబయికి చెందిన కవిత, ప్రతాప్ జాదవ్ అనే మరో ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై వీరిని విజయవాడ తరలించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ముఠాలోని మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.


