News March 15, 2025

వనపర్తి: ఒంటిపూట బడులు.. ఒక్కో క్లాస్ ఎంతసేపంటే..?

image

నేటి నుంచి ఒంటిపూట బడుల నేపథ్యంలో ఒక్క క్లాస్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనే వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గం.లకు 1వ బెల్, 8:05కు 2వ బెల్, 8:15- 8:55 వరకు 1వ పీరియడ్, 8:55- 9:35 వరకు 2వ పీరియడ్, 9:35- 10:15 వరకు 3వ పీరియడ్, 10:15- 10:30 గంటలకు బ్రేక్. 10:30 గం. నుంచి 11:10 వరకు 4వ పీరియడ్, 11:10 గం. నుంచి 11:50 వరకు 5వ పీరియడ్, 11:50 గం. నుంచి 12:30 వరకు చివరి పీరియడ్‌. SHARE IT

Similar News

News March 15, 2025

NZB: మనవడి బర్త్‌డే.. తాత సూసైడ్

image

NZBకి చెందిన రాఘవేంద్రరావు(60) HYD మియాపూర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మనవడి బర్త్‌డే పార్టీ కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం షాపింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో రాఘవేంద్రరావు బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 15, 2025

భద్రాద్రి జిల్లాలో జబర్దస్త్ నటుల సందడి

image

భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ జగదాంబమాత జయలింగేశ్వర స్వామివారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఈవెంట్‌కు వచ్చిన జబర్దస్త్ నటులకు ఆలయ కమిటీ  ఘనస్వాగతం పలికింది. అనంతరం వారికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జ్ఞాపికలు అందించి, సత్కరించారు. తిరునాళ్లలో రాకెట్ రాఘవ టీం సందడి చేశారు.

News March 15, 2025

కర్నూలులో హత్య.. పాత కక్షలే కారణమా?

image

కర్నూలులో TDP నేత సంజన్న <<15763975>>హత్య<<>> కలకలం రేపింది. శరీన్‌నగర్‌లో ఉంటున్న సంజన్నకు స్థానికంగా అంజితో ఆధిపత్యపోరు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సంజన్నపై దండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సంజన్న వర్గీయులు ఆంజి వాహనంపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అంజి వర్గీయులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!